Homeహైదరాబాద్latest News‘పది’ పరీక్షలు ప్రారంభం

‘పది’ పరీక్షలు ప్రారంభం

– తొలిరోజు 12,445 మంది హాజరు
– జిల్లావ్యాప్తంగా 75 కేంద్రాల ఏర్పాటు
– కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్​, అధికారులు

ఇదేనిజం, కరీంనగర్​ ఎడ్యూకేషన్​: పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. కరీంనగర్​ జిల్లావ్యాప్తంగా 75 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు పరీక్షలకు 12,458 మందికి 12,445 మంది విద్యార్థులు హాజరయ్యారు. 13 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 43 మందికి 23 మంది పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ బృందాలు 26 పరీక్షా కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ 7 కేంద్రాలను, జిల్లా విద్యా శాఖాధికారి 7 కేంద్రాలను, రాష్ట్ర పరిశీలకులు 6 కేంద్రాలను, అదనపు కలెక్టర్ ఒక కేంద్రాన్ని, కలెక్టర్ 2 మొత్తం 49 కేంద్రాలను తనిఖీ చేశారు. ఆయా చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్​ అధికారులు వేణు కుమార్, బీ రమేశ్ బాబు, చీఫ్ సూపరిండెంట్లు మోహన్ రెడ్డి, ప్రమోద, డీవో లక్ష్మణరావు తదితరులు పరిశీలించారు. మొదటి రోజున తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖాధికారి సీహెచ్​వీఎస్​ జనార్దనరావు తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్ లో ఉన్న సెయింట్ ఆల్పోన్స్ పాఠశాల, మంకమ్మతోటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ధన్గర్ వాడి) కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎలాంటి తప్పుదాలకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. సెయింట్ ఆల్ఫ్ న్స్ పాఠశాలలో దివ్యాంగులు పరీక్ష రాస్తున్న గదిని కలెక్టర్ పరిశీలించారు.

Recent

- Advertisment -spot_img