Homeరాజకీయాలుఖమ్మంలో పదికి పది గెలుస్తం

ఖమ్మంలో పదికి పది గెలుస్తం

– మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎవరు అడ్డు పడ్డా పదికి పది కాంగ్రెస్ గెలుస్తుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం పదవిని చాలా మంది ఆశిస్తారు. కానీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కర్ణాటకలో డీకే శివకుమార్ సీఎం అనుకున్నారు. కానీ సిద్ద రామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయి’అని ఆమె స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లతో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారన్నారు. 18 ఏళ్ళ యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ కొత్త సినిమాను ప్రజలు నమ్మరని.. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్‌కు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు.ఓట్లకు డబ్బులు పంచి గెలుద్దాం అనుకునే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రేణుకా చౌదరి తెలిపారు. మైనారిటీలు కాంగ్రెస్ వెంట ఉన్నారని ఆమె చెప్పారు.

Recent

- Advertisment -spot_img