Homeఫ్లాష్ ఫ్లాష్Charging stations : దేశవ్యాప్తంగా 10 వేల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు

Charging stations : దేశవ్యాప్తంగా 10 వేల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు

ten thousand Charging stations in india for electronic vehicles : దేశవ్యాప్తంగా 10 వేల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు

దేశంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ)..

వచ్చే మూడేండ్లకాలంలో విద్యుత్తుతో నడిచే వాహనాల కోసం దేశవ్యాప్తంగా 10 వేల చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.

2070 నాటికి దేశాన్ని కార్బన్‌ రహిత దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా తమవంతుగా వచ్చే మూడేండ్లలో 10 వేల ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఐవోసీ చైర్మన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య తెలిపారు.

వీటిలో తొలి ఏడాది హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై, సూరత్‌, పుణెల్లో 231 ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

అలాగే రెండో ఏడాది 375 స్టేషన్లు, ఆ తర్వాతి ఏడాది 215 స్టేషన్లను నెలకొల్పాలని భావిస్తున్నది.

ప్రతి 25 కిలోమీటర్ల దూరంలో 50 కిలోవాట్ల ఈవీ చార్జింగ్‌ స్టేషన్‌ను, ప్రతి 100 కిలోమీటర్ల దూరంలో 100 కిలోవాట్ల హెవీ-డ్యూటీ చార్జింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నది సంస్థ.

వినియోగదారుడు సులభంగా చార్జింగ్‌ చేసుకునే విధంగా ఈ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు, వీటిని పాత, కొత్త పెట్రోల్‌ పంపుల్లో నెలకొల్పాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

Recent

- Advertisment -spot_img