Homeహైదరాబాద్latest Newsఆ హీరోతో టెన్నిస్ భామ డేటింగ్.. పెళ్లి ఎప్పుడంటే..?

ఆ హీరోతో టెన్నిస్ భామ డేటింగ్.. పెళ్లి ఎప్పుడంటే..?

కొన్నేళ్ల క్రితం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ కోర్టులో వరుస విజయాలతో దూసుకుపోయింది. ప్రస్తుతం అందాల భామ రెండో పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సానియాకు 14 ఏళ్ల క్రితం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో వివాహమైంది. క్రీడా ప్రపంచంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ సెలబ్రిటీ జంట పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలో మీర్జా ఓ తెలుగు హీరోని పెళ్లి చేసుకోబోతున్నట్లు కొత్త వార్త హల్ చల్ చేస్తోంది.నటుడి పేరు వెల్లడించనప్పటికీ, చాలా మంది అభిమానులు ఈ సంబంధం పెళ్లికి దారితీస్తుందని నమ్ముతున్నారు. ఈ పుకార్లపై సానియా మీర్జా ఇంకా స్పందించలేదు.గతంలో భారత క్రికెటర్ మహ్మద్ షమీతో సానియా పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని తర్వాత తేలిపోయింది.

Recent

- Advertisment -spot_img