మంచు ఫ్యామిలీ రచ్చ రోడ్డుకెక్కింది.. తాజాగా జలపల్లి లోని మంచు మనోజ్ దంపతులు ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. అనంతరం లోపలికి వెళ్లిన మీడియా పై మోహన్ బాబు దాడి చేసి అరాచకం సృష్టించారు. వారి చేతుల్లో ఉన్న మైకులను తీసుకుని నేలకేసి కొట్టారు. మరోవైపు టీవీ ఛానెల్ ప్రతినిధి పై మోహన్ బాబు దాడి చేసినట్లు సమాచారం. పోలీసులు ఆయనను ఆపేందుకు ప్రయత్నించారు.