Sangareddy : చందాపూర్ ఎస్బీ పరిశ్రమ ఘటనా స్థలాన్ని మాజీ మంత్రి హరీష్రావు సందర్శించారు. సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి తో ఆయన ఫోన్లో మాట్లాడారు. బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు. కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో ఘటనా స్థలం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లాఠీచార్జ్ చేసి అక్కడున్నవారిని పోలీసులు చెదరగొట్టారు. ప్రమాద ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు దుర్మరణం చెందారు.