తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ మహిళా నేతలు ప్రయత్నించారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీసువైపు ఒక్కసారిగా దూసుకెళ్లారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీని తీవ్రవాదితో పోల్చుతూ కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ, ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.