Tenth Class Exams : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి (మార్చి 17) నుంచి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు (Tenth Class Exams) ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఉచిత ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అలాగే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు మొత్తం 6,49,275 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.