తెలంగాణలో ‘టెన్త్’ వార్షిక పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. దీనితో విద్యార్థుల హాల్ టిక్కెట్లను శుక్రవారం వెబ్‌సైట్‌లో ఉంచుతామని. వాటిని పాఠశాలలకు కూడా పంపుతామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ. కృష్ణారావు తెలిపారు. వివిధ కారణాల వల్ల పాఠశాల యాజమాన్యం హాల్ టిక్కెట్లను అందించడానికి నిరాకరిస్తే, విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుండి వాటిని డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలు రాయవచ్చని ఆయన తెలిపారు.