రేపు (ఏప్రిల్ 22) ఉదయం 11 గంటలకు ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ https://results.bse.ap.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం రికార్డుస్ధాయిలో కేవలం 22 రోజుల్లోనే ఏపీ ఎస్‌ఎస్‌సీ రిజల్ట్స్ ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆలోపే పదోతరగతి ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఏప్రిల్ 22న పది ఫలితాల వెల్లడికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో గత నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు హాజరయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 6.23 లక్షలు ఉండగా, గతేడాది ఫెయిలై పరీక్షలు రాసిన విద్యార్ధులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించారు.