బెంగళూరులోని ఫ్లైఓవర్‌పై మంగళవారం వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది. వోల్వో బస్సు అదుపుతప్పి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. వోల్వో బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.