Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో ఘోర విషాదం.. 10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు..!

తెలంగాణలో ఘోర విషాదం.. 10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు..!

10 నెలల బాలుడిని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ బస్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి తల్లి బహిర్భూమికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి బాలుడు కనిపించకపోవడంతో ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడక్కడ మాంసపు ముద్దలు దొరికాయి. అవి చిన్నారి అవయవాలుగా గుర్తించి బాలుడిని కుక్కలు పీక్కుతిన్నట్టు నిర్ధారించారు. వాటిని సేకరించి బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పగించారు.

Recent

- Advertisment -spot_img