తమిళనాడులో రైలు ప్రమాదం జరిగింది. భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట్టై రైల్వే స్టేషన్ సమీపంలో అతి వేగంతో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్తున్న ఈ రైలులో 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదం కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట్టై రైల్వే స్టేషన్ సమీపంలో భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో కోయెన్ కోచ్‌లు చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే స్థానికులు, అధికారులు అప్రమత్తమై.. తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ చనిపోలేదని దక్షిణ రైల్వే తెలిపింది.