Homeఅంతర్జాతీయంఫ్రాన్స్ చ‌ర్చిలో ఉగ్ర దాడి.. మ‌హిళా త‌ల తెగ్గోసిన ఉన్మాది

ఫ్రాన్స్ చ‌ర్చిలో ఉగ్ర దాడి.. మ‌హిళా త‌ల తెగ్గోసిన ఉన్మాది

పారిస్‌ : ఫ్రాన్స్‌ నగరం నీస్‌లో నాట్రేడేమ్‌ చర్చిలో ఉగ్ర‌దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గుర మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

కత్తితో చర్చిలో ప్రవేశించిన ఆగంతకుడు మహిళపై దాడి చేసి ఆమె తలను నరికేశాడు. ఈ క్ర‌మంలో మరో ఇద్దరిపై క‌త్తితో దాడి చేసి చేసి హ‌త‌మ‌ర్చాడు.

ఈ ఘ‌ట‌న వివ‌రాల‌ను నీస్‌ మేయర్‌ క్రిస్టియన్‌ ఎస్త్రోసి వెల్లడించారు. నిందితుడు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారని ప్రస్తుతం నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.

దాడికి తెగబడిన వ్యక్తి ఓ మతానికి సంబంధించి నినాదాలు చేశాడని చెప్పారు. మరణించిన వారిలో ఒకరిని చర్చి వార్డెన్‌గా భావిస్తున్నామని మేయర్‌ పేర్కొన్నారు.

ఈ ఉగ్ర‌దాడిలో పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫ్రాన్స్‌ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూషన్‌ విభాగం దర్యాప్తు చేపట్టనుంది.

ఫ్రాన్స్‌లో ఈ తరహా దాడి ఈ నెలలో ఇది రెండవది కావడం​ గమనార్హం. ఫ్రెంచ్‌ మిడిల్‌ స్కూల్‌ టీచర్‌ను ఇటీవల చెచెన్యా సంతతికి చెందిన ఓ వ్యక్తి తలనరికి చంపడం కలకలం రేపింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img