మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాల శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2:15 గంటల వరకు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఉగ్రవాదులు బాంబులు కూడా విసిరారు. వాటిలో ఒకటి CRPF 128 బెటాలియన్‌లోని అవుట్‌పోస్ట్ వద్ద పేలిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మృతులను సీఆర్పీఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎన్ సర్కార్, హెడ్ కానిస్టేబుల్ అరూప్ సైనీగా గుర్తించారు.