Homeజాతీయంఅంబానీ ఇంటిముందు కారు పెట్టింది ఉగ్రవాద సంస్థనే

అంబానీ ఇంటిముందు కారు పెట్టింది ఉగ్రవాద సంస్థనే

Reliance Industries chief Mukesh Ambani has been accused of placing explosives in front of his house, a militant group has said.

Gelatin sticks were left on the SUV, they said in a recent statement.

Jaish-ul-Hind, a terrorist group, shared a message with the Telegram Group. It also challenged the companies investigating the incident.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాలు ఉంచింది తామేనంటూ ఓ ఉగ్రవాద సంస్థ పేర్కొంది.

ఎస్‌యూవీలో జిలెటిన్ స్టిక్స్‌ను అక్కడ వదిలింది, తామేనంటూ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.

జైష్ ఉల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థ ఈ మేరకు టెలిగ్రాం గ్రూప్‌లో ఓ మెసేజ్‌ను షేర్ చేసింది.

అంతేకాకుండా ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సంస్థలకు కూడా ఛాలెంజ్ చేసింది.

భారత్‌కు చెందిన శక్తిమంతమైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇజ్రాయెల్‌కు చెందిన మొసాద్ రెండు కలిసి ప్రయత్నించినా ఇజ్రాయెల్ ఎంబసీ ముందు జరిగిన బాంబు బ్లాస్ గురించి తెలుసుకోలేకపోయారని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఆ మెసేజ్‌లో ఉగ్రవాద సంస్థ పేర్కొంది.

అంబానీ ఇంటిముందు ఆ కారును ఆపిన వ్యక్తి కూడా ఇప్పటికే సురక్షితంగా తిరిగివచ్చేశాడని పేర్కొంది.

అయితే ఈ మెసేస్‌పై ముంబై పోలీసుల నుంచి కానీ, దర్యాప్తు సంస్థల నుంచి కానీ ఎలాంటి అధికారి ప్రకటన రాలేదు.

ఇదిలా ఉంటే అంబానీ ఇంటిముందు ఉంచిన కారును అంబానీ సెక్యూరిటీ సిబ్బంది మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తించారు.

పోలీసులు అక్కడకు చేరుకుని 2.60 కేజీల బరువున్న జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించి సీజ్ చేశారు.

దానితో పాటు ఓ లెటర్ కూడా లభించింది. ఆ లెటర్‌లో ‘ఇది ట్రైలర్ మాత్రమే. ముందు చాలా జరగబోతోంది’ అంటూ రాసి ఉంది.

అంతేకాకుండా అంబానీని బిట్ కాయిన్ ద్వారా కోట్ల రూపాయలు కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

 

Recent

- Advertisment -spot_img