ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ నెల 20 వరకు అప్లికేషన్లకు అవకాశం కల్పిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి ఈరోజుతో టెట్ దరఖాస్తు ముగియనుంది. ఈ సారి టెట్ అప్లికేషన్లు గణనీయంగా తగ్గాయి. మూడు లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు భావించారు. కానీ ఇప్పటివరకు 2 లక్షల లోపే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సారి అప్లికేషన్ ఫీజు రూ.1000 గా నిర్ణయించడం కూడా అభ్యర్థుల్లో నెగటివ్ ఫీలింగ్ కలిగేలా చేసిందని తెలుస్తోంది.