TG 10th Class Results : టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా తెలంగాణ 10వ తరగతి ఫలితాలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. 10వ తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదలవుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. మెమోలపై ముద్రణ మార్కులపై ప్రభుత్వం స్పష్టత రాగానే 10వ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4, 2025 వరకు జరిగాయి.ఈ పరీక్షలకు సుమారు 4.8 నుంచి 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఫలితాలు చెక్ చేసే విధానం : అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in సందర్శించండి.
“TS SSC Result 2025” లింక్‌పై క్లిక్ చేయండి. హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి. ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వీటిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
SMS ద్వారా ఫలితాలు : వెబ్‌సైట్‌లు లోడ్ కాకపోతే, SMS ద్వారా కూడా ఫలితాలు చెక్ చేయవచ్చు. దీని కోసం TS10ROLL NUMBER అని టైప్ చేసి 56263కు పంపండి. మీ ఫలితాలు SMS ద్వారా వస్తాయి.