TG Govt: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలని సీఎం రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఇందులో బాగంగా పర్యాటక ప్రాంతాలకు నిలయమైన హైదరాబాద్ నగర అభివృద్ధికి పూనుకుంది. ఈ మేరకు నూతన టూరిజం పాలసీ-2025 ను ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ద్వార చారిత్రక ప్రదేశాలను, వారసత్వ కట్టడాలను గుర్తించి అభివృద్ది చేయనుంది. ముఖ్యంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలలో స్కై వాక్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.