తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది. వయో వృద్ధులు, దివ్యాంగులు ఇంటినుంచే ఓటుహక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఏప్రిల్ 23లోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టంచేశారు. మే 3 నుంచి 8 వరకు వారి ఓటు నమోాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 3 కోట్లకుపైగా ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. ఇంకా 1.17 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.