TGPSC : టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. మే 1వ తేదీ నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఇందుకోసం మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని.. ఏప్రిల్‌లో ఖాళీల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కృషి చేస్తామని తెలిపింది. కొత్త నోటిఫికేషన్లు జారీ చేసి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం గ్రూపుల ఫలితాలు వెలువడేలా చూస్తామన్నారు.