తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీకి త్వరలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించగా.. తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. మోడల్ ఆన్సర్ బుక్‌లెట్లను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీజీపీఎస్సీ పేర్కొంది.