తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో తమ విద్యుత్ సిబ్బంది దాదాపు 36 గంటల నుంచి క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా పని చేస్తున్నారని, వారికి ప్రజలు సహకరించాలని TGSPDCL కోరింది. విపత్కర సమయాల్లో సిబ్బంది వారి కుటుంబాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజల భద్రత కోసం పూర్తి అంకితభావం, నిబద్ధతతో సేవలందిస్తున్నారని పేర్కొంది. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలుంటే 1912కు కాల్ చేయాలని సూచించింది.