TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు కార్గో, లాజిస్టిక్స్ సేవల ద్వారా అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే సరఫరా చేయనున్నారు. ఈ ఏడాది కల్యాణ తలంబ్రాలు పంపిణీ చేసేందుకు ఆర్టీసీ యంత్రాంగం సిద్ధమైంది. భద్రాచలంలో ఏప్రిల్ 6న సీతారాముల కల్యాణం జరుగనుండగా, భక్తులు ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలు పొందవచ్చని అధికారులు తెలిపారు.