తెలంగాణలో దసరా నుంచి ఇంటింటికీ కార్గో సేవలు అందించాలని TGRTC నిర్ణయించింది. వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేయగానే సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వస్తువులను తీసుకెళ్లి ఇచ్చిన అడ్రస్లో డెలివరీ చేస్తారు. ఆర్డర్ పరిమాణాన్ని బట్టి వెహికల్స్ ని ఉపయోగిస్తారు. తొలుత దీనిని హైదరాబాద్ లో, ఆ తర్వాత ఇతర జిల్లాల్లో అమలు చేయనున్నారు. ప్రస్తుతం కార్గో సేవలు ఒక బస్ స్టేషన్ నుంచి మరో బస్ స్టేషన్ వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.