Homeహైదరాబాద్latest Newsప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఇకపై వారికి టికెట్ డబ్బుల బాధ లేదు..!

ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఇకపై వారికి టికెట్ డబ్బుల బాధ లేదు..!

ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ మరో శుభవార్త చెప్పనుంది. బస్సుల్లో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు మరో సదుపాయాన్ని అందుబాటులోకి తేస్తోంది. టికెట్ కు సరిపడ చిల్లర విషయంలో కండక్టర్, ప్యాసింజర్ కు మధ్య తలనొప్పి సమస్య లేకుండా డిజిటల్ పేమెంట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. క్యూఆర్ కోడ్ విధానం ద్వారా టికెట్ కొనుగోలు చేసే విధంగా కొత్త సౌకర్యాన్ని త్వరలోనే ప్రారంభించనుంది. జంట నగరాల పరిధిలోని దిల్ సుఖ్ నగర్, బండ్లగూడ డిపోలకు చెందిన బస్సుల్లో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులను కొనసాగిస్తున్నారు. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డంతో అన్ని ఆర్టీసీ బ‌స్సుల్లో డిజిట‌ల్ పేమెంట్స్ అమలు చేయాలని నిర్ణ‌యం తీసుకుంది.

Recent

- Advertisment -spot_img