Homeహైదరాబాద్latest NewsFake Apps: నకిలీ యాప్‌లపై TGSRTC ఎండీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు..!

Fake Apps: నకిలీ యాప్‌లపై TGSRTC ఎండీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు..!

Fake Apps: టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన నకిలీ ఫోన్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎక్స్‌లో ఆయన ఓ కొన్ని వీడియోలు పోస్ట్ చేసి ఇలా రాసుకొచ్చారు.. “నకిలీ యాప్ లతో నగదు బదిలీ చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో ఇలాంటి వందలాది వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కొంత డబ్బు చెల్లిస్తే ఫేక్ ఫోన్ పే యాప్ లింక్ పంపిస్తామంటూ మాయమాటలు చెప్పి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

అచ్చం ఫోన్ పే యాప్ లాగానే ఫేక్ యాప్స్ పనిచేస్తున్నాయి. ఈ ఉత్తుత్తి యాప్ లతో చిరు వ్యాపారులు, అమాయక ప్రజలను కేటుగాళ్ళు మోసం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. APK ఫైల్స్ ని డౌన్ లోడ్ చేసుకోకండి. డౌన్ లోడ్ చేసుకునే ముందు యాప్‌ను వెరిఫై చేసుకోండి. మీరు సరైన దానినే డౌన్‌లోడ్ చేసుకున్నారా అని సరి చూసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ ను పరిశీలించాలి. ఒక మోసపూరిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఉండొచ్చని భావిస్తే, ఆ యాప్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. నకిలీ యాప్‌లు మీ డేటాకు తీవ్ర హాని కలిగిస్తాయి. అప్రమత్తంగా ఉండడం ద్వారా ఇలాంటి హానికరమైన యాప్‌లనుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img