Homeహైదరాబాద్latest News40 నిమిషాలకు 40 కోట్లు తలైవా రెమ్యూనరేషన్ రేంజ్

40 నిమిషాలకు 40 కోట్లు తలైవా రెమ్యూనరేషన్ రేంజ్

సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వయసు 73 ఏళ్లు. అయినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సూపర్ స్టార్. గతేడాది రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆయన నటించిన ‘లాల్‌ సలామ్‌’ చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ అవుతోంది. ‘లాల్ సలామ్’ సినిమాలో రజనీకాంత్ పోషించిన పాత్ర పేరు మొయిద్దీన్ భాయ్. సినిమాలో ఆ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. అందుకు గాను ఆయన 40 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారని కోలీవుడ్‌ టాక్. అంటే నిమిషానికి కోటి రూపాయలు వసూలు చేశారన్న మాట. ఇక ఈ వార్త అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. కూతురి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అయినా కూడా.. రెమ్యూనరేషన్‌ విషయంలో రజీని తీరు కాస్త, ట్రోల్ కూడా అవుతోంది.

Recent

- Advertisment -spot_img