Homeహైదరాబాద్latest NewsThalapathi Vijay : పొత్తులుండవ్‌.. నేనే సీఎం

Thalapathi Vijay : పొత్తులుండవ్‌.. నేనే సీఎం

Thalapathi Vijay : వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా పార్టీ అధినేత, స్టార్ హీరో విజయ్‌ను ప్రకటించింది. శుక్రవారం చెన్నైలోని పనైయూర్‌లో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఈ తీర్మానం ఆమోదించబడింది.

ఈ సమావేశంలో విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు, ఎన్నికలకు సంబంధించి పొత్తులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే పార్టీ డీఎంకే, భాజపాలతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ రెండు పార్టీలను తమ సైద్ధాంతిక శత్రువులుగా పేర్కొంటూ, వాటితో ఎలాంటి సంబంధం ఉండదని విజయ్‌ తేల్చిచెప్పారు. “మేము డీఎంకే, ఏఐఏడీఎంకేలా కాదు, రాజకీయ లబ్ధి కోసం భాజపాతో చేతులు కలపడానికి. తమిళనాడులో భాజపా విభజన రాజకీయాలు, విషపూరిత విధానాలు చెల్లవు,” అని విజయ్‌ వ్యాఖ్యానించారు.

విజయ్‌ తన ప్రసంగంలో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “భాజపా రాష్ట్రంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా విభజన రాజకీయాలు చేస్తోంది. పెరియార్‌, అన్నాదురై వంటి నాయకులను అవమానిస్తూ, చీప్‌ పొలిటికల్‌ మైలేజ్‌ కోసం ప్రయత్నిస్తోంది. అలాంటి రాజకీయాలు తమిళనాడులో నడవవు,” అని ఆయన అన్నారు. అలాగే డీఎంకే పైనా విమర్శలు గుప్పించిన విజయ్‌, ఆ పార్టీని కుటుంబ పార్టీగా, అవినీతిలో కూరుకుపోయిన పార్టీగా విమర్శించారు.

టీవీకే పార్టీ తన సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే నెలలో భారీ ఎత్తున రాష్ట్ర మైన సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ ప్రతిపాదించింది. సెప్టెంబర్‌ నుంచి విజయ్‌ రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలను, ఎన్నికల వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 120 జిల్లా స్థాయి సమావేశాలు, ఐదు ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని టీవీకే నిర్ణయించింది.

Recent

- Advertisment -spot_img