తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తదుపరి సినిమాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దళపతి విజయ్ చివరి సినిమాని హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాటైటిల్ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 50 శాతం సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. దళపతి 69ని పూర్తి చేసిన విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. దళపతి 69 టైటిల్‌ను న్యూ ఇయర్‌కి ముందే విడుదల చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పొంగల్ పండుగ రోజున టైటిల్‌ని ప్రకటిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా పూర్తిగా కమర్షియల్‌గా ఉంటుంది. కాస్త రాజకీయం కూడా ఉంటుందన్నారు. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగానే ‘విజయ్ 69′ సినిమా విదేశీ హక్కులను భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.’విజయ్ 69’ సినిమా విదేశీ హక్కులను దక్కించుకున్న ఫర్జ్ ఫిల్మ్స్ దాదాపు రూ.78 కోట్లు చెల్లించింది. ఇంతకు ముందు ఏ తమిళ సినిమా విదేశీ హక్కులు ఇంత భారీ ధరకు అమ్ముడుపోలేదని చెప్పొచ్చు.