Homeహైదరాబాద్latest Newsఏపీలో 'తల్లికి వందనం' పథకం.. ఆ నెలలో వారికీ రూ.15,000 జమ

ఏపీలో ‘తల్లికి వందనం’ పథకం.. ఆ నెలలో వారికీ రూ.15,000 జమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే జనవరిలో ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్కూళ్లు,కాలేజీలకు వెళ్లే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని టిడిపి మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. అలాగే రూ.20 వేల లబ్ధి చేకూర్చే ‘అన్నదాత సుఖీభవ’ను మార్చి లేదా ఏప్రిల్ నెలలో అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img