తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 8’ హౌస్ లోకి కొత్త కాంటెస్ట్స్ రాకతో అందరి ఆట తీరు మారిపోయింది. అయితే ఈ వారంలో ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో ‘కిర్రాక్ సీత’ ఎలిమినేట్ అయింది. ఇప్పటికే ఈ సీజన్‌లో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా కిర్రాక్ సీత రెమ్యునరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిర్రాక్ సీత రెమ్యునరేషన్ వారానికి రూ.2 లక్షల చొప్పున ఆరు వారాలకు దాదాపు రూ.12 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అధికారికంగా ఎంత అనేది ఇంకా తెలియదు.