Homeహైదరాబాద్latest Newsఅదే మా కొంపముంచింది.. మా ఓటమికి అదే కారణం: హార్దిక్

అదే మా కొంపముంచింది.. మా ఓటమికి అదే కారణం: హార్దిక్

ఐపీఎల్-2024లో భాగంగా నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఈ సీజన్‌లో ఎనిమిదో ఓటమిని చవిచూసింది. మరోవైపు KKR 12 మ్యాచ్‌లలో తొమ్మిది గెలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఐపీఎల్-2024 తర్వాతి దశకు చేరుకున్న తొలి జట్టుగా కోల్‌కతా నిలిచింది. అయితే కోల్‌కతాతో మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ ఓటమికి గల కారణాలు వివరించాడు. గొప్ప ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడమే తమ జట్టు ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ”ఇది చాలా కఠినమైనది. ఛేదనలో మాకు శుభారంభం దక్కింది. కానీ దాన్ని కొనసాగించలేకపోయాం. ఈ వికెట్ భిన్నమైనది. ఇక్కడ బ్యాటింగ్‌లో జోరు అందుకోవడం చాలా ముఖ్యం. అది ఛేదించగలిగే లక్ష్యమే అని హార్దిక్ఆనాడు. బౌలర్లు గొప్పగా పోరాడారు” అని వివరించాడు.

Recent

- Advertisment -spot_img