ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. EHS, OP సేవలను బంద్ చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని ఆస్పత్రుల అసోసియేషన్ హెచ్చరించింది.ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) అధ్యక్షుడు కె. విజయ్ కుమార్ వెల్లడించారు.