Homeహైదరాబాద్latest Newsఆ కార్యాలయం ఎప్పుడు చుసిన తాళమే.. విధుల పట్ల ఎం ఆర్ సి సిబ్బంది నిర్లక్ష్యం

ఆ కార్యాలయం ఎప్పుడు చుసిన తాళమే.. విధుల పట్ల ఎం ఆర్ సి సిబ్బంది నిర్లక్ష్యం

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల వనరుల కేంద్రంలో విధులు నిర్వర్తించే సిబ్బంది కార్యాలయానికి హాజరుకాకుండా తమ ఇష్టారీతిలో వ్యవహరిస్తూ కార్యాలయానికి ఉదయం 11:30 అయినా తాళం వేసి ఉండడం విమర్శలకు తవిస్తుంది త్వరలో పాఠశాల లలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అడిగే వారు లేరనే చందంగా తమకు నచ్చినప్పుడు హాజరవుతూ. వెళ్లిపోతున్నారు.కార్యాలయంలో మండల విద్యాధికారి సహాయకుడు, కంప్యూటర్ ఆపరేటర్, ఒక అటెండర్ విధులు నిర్వహించవలసి ఉండగా.. ఒక్కరు కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో కార్యాలయంలో నిర్వహించే డే టా ఎంట్రీ ఆపరేటర్, సమన్వయకర్త ఒప్పంద ఉద్యోగులు పనిచేయడం లేదని కేవలం వారి వ్యక్తిగత పనులకు సమయానికి కేటాయిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి వివరణ కోరగా తొమ్మిది గంటలకి విధులకు వచ్చి తాళం వేశామని చెప్పడం గమనార్గం ఇప్పటికైనా జిల్లా స్థాయి విద్యాధికారులు దృష్టి సారించి కార్యాలయంలో నిర్వహించే కార్యకలాపాలు జరిగేలా సిబ్బంది హాజరయ్యాలా చూడాలని కోరుతున్నారు

Recent

- Advertisment -spot_img