Homeహైదరాబాద్latest Newsకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్.. ఆ కేసు కారణంగా జాతీయ అవార్డు రద్దు..!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్.. ఆ కేసు కారణంగా జాతీయ అవార్డు రద్దు..!

లైంగిక వేధింపుల ఆరోపణలపై స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు అందించాల్సిన జాతీయ అవార్డును సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా, అక్టోబర్ 8న ఢిల్లీలో అవార్డుల కార్యక్రమం జరగనుంది. అయితే చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ జాతీయ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరగా రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ కు కోర్టు అక్టోబరు 6 నుంచి అక్టోబర్ 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో జానీ మాస్టర్ అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో… నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ అనూహ్య ఝలక్ ఇచ్చింది. తనను వేధిస్తున్నారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో జానీపై కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసు కూడా నమోదు చేశారు. అయితే, ఇప్పుడు ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును కేంద్రం వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోక్సో కేసు నమోదవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img