టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికైన తర్వాత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ వారసుడిగా హార్దిక్ పాండ్యా టీ20 జట్టుకు బాధ్యతలు చేపట్టాలని భావించగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈ సందర్భంగా సూర్యకుమార్ మాట్లాడుతూ.. కొత్త బాధ్యతలను ఎంతగానో ఆస్వాదిస్తున్నానన్నారు. ఇదే సమయంలో కోచ్ గంభీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మా బంధం చాలా ప్రత్యేకమైనది. 2014లో గంభీర్ నాయకత్వంలో కేకేఆర్ తరఫున ఆడాను. నేను ఎలా ఆడతానో అతనికి బాగా తెలుసు. మా కాంబో ఎలాంటి ఫలితాలు వస్తాయనే మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని తెలిపారు.