భారత టీ20 జట్టు కెప్టెన్సీ హార్దిక్ పాండ్యకు ఇవ్వకపోవడానికి గల కారణాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. సోమవారం కోచ్ గంభీర్‌తో కలిసి ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హార్దిక్ జట్టులో కీలక ఆటగాడని, అయితే తరచూ ఆయనకు ఫిట్‌నెస్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. 2026 టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపారు.