మృణాల్ ఠాకూర్.. యంగ్ బ్యూటీఫుల్ హీరోయిన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. తెలుగు పరిశ్రమలోకి సీతారామం సినిమాతో అడుగు పెట్టింది. తన అందం, నటనతో అందరినీ కట్టిపడేసింది. తర్వాత వచ్చిన హాయ్ నాన్న, ఫ్యామిలీస్టార్ సినిమాలతో తెలుగింటి అమ్మాయిలా మారిపోయింది. అభిమానుల మనసును దోచుకుంటోంది. మృణాల్ రొమాంటిక్ సీన్స్ లో నటించక పోవడానికి గల కారణాలు వెల్లడించింది.
‘రొమాంటిక్ సీన్స్‌లో నటించడం నాకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే ముద్దు సన్నివేశాలు ఉన్న కారణంగా కొన్ని సినిమాలు వదులుకున్న సందర్భాలూ ఉన్నాయి’ అని మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘అలాంటి వాటిలో నటించడం నా తల్లిదండ్రులకు నచ్చదు. అందుకే నో చెప్పాను. అటువంటి సన్నివేశాల్లో నన్ను చూస్తే వాళ్లు ఏమనుకుంటారో’ అని భయం వేసేది. అది కథలో భాగమేనని మంచి పాత్ర అయినప్పుడు ఈ కారణంగా సినిమాలో వదులుకోలేనని వాళ్లకు వివరించాను. దీంతో అంగీకరించారు.