Homeహైదరాబాద్latest NewsSalary కి బదులు ఉప్పు అందుకే ఆ సామెత

Salary కి బదులు ఉప్పు అందుకే ఆ సామెత

జాబ్ చేసే ప్రతి ఉద్యోగులు ఒకటో తారీకు రాగానే శాలరీ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ శాలరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకానొక కాలంలో శాలరీ పేరుతో ఉప్పును ఇచ్చేవారనే సంగతి మీకు తెలుసా? పురాతన రోమ్‌లో డబ్బుకు బదులుగా ఉప్పును ఉపయోగించేవారట. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలో పనిచేసే సైనికులకు వారి పనికి ప్రతిఫలంగా ఉప్పును ఇచ్చేవారు.బహుశా అందుకేనేమో ‘ఉప్పు ఋణం’ లాంటి సామెతలు ఆ కాలం నుంచే ఉద్భవించాయని చెబుతుంటారు.రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన ‘నేచురల్ హిస్టరీ’ పుస్తకంలో..రోమ్‌లో సైనికులకు ఉప్పు రూపంలో శాలరీ ఇచ్చేవారని పేర్కొన్నారు.. సోల్జర్ అనే పదం లాటిన్ పదం ‘సల్ డేర్’ నుండి ఉద్భవించిందని, దీని అర్థం ‘ఉప్పు ఇవ్వడం’ అని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అలాగే రోమన్‌లో ఉప్పును సలారియం అంటారు అప్పట్లో ఉప్పు వ్యాపారం కూడా బాగా జరిగేది.10,000 బీసీ, 6,000 బీసీ మధ్య మొదటిసారి శాలరీ ఇచ్చారని ఫ్రెంచ్ చరిత్రకారులు భావిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img