ఇది నిజం, బెల్లంపల్లి: గత నెల 28-06-2024 రోజున భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సింగరేణి కొల్ బెల్ట్ కమిటి కార్యదర్శి ప్రభాత్ పేరుతో బెల్లం పల్లి పట్టణానికి చెందిన శివ ప్రసాద్, బద్రి వెంకటేశ్వర్లను హెచ్చరిస్తూ మావోయిస్టు కార్యదర్శి ప్రభాత్ విడుదల చేసిన ప్రకటన పై విలేకరి బద్రి శివ ప్రసాద్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా బద్రి శివ ప్రసాద్ మాట్లడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సింగరేణి కొల్ బెల్ట్ కమిటి కార్యదర్శి ప్రభాత్ విడుదల చేసిన ప్రకటనలో తన పై చేసిన అభియోగాలు నిజం కావాని, ఒక్కసారి ఈ విషయం పై సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ పునరాలోచన చేయాలన్నారు. తన పై చేసిన అభియోగాలు నిజం అని నిరూపన అయితే ప్రజా క్షేత్రంలో బహిరంగ క్షేమాపణ చేప్పడానికి తాను సిద్దంగా ఉన్నానన్నరు. అంతే కాకుండా కొంత మంది గుర్తు తెలియని దుండగులు మావోయిస్టు ప్రకటను అధారంగా చేసుకోని తన పై కత్తుల తో దాడి చేసారని తనకు ప్రాణ భయం ఉందన్నారు.
విలేకరిగా సమాజంలో నేలకొంటున్న ప్రజల సమస్యలను నిత్యం తాను బహిర్గతం చేస్తుండడంతో కొంత మంది కావాలనే భారత కమ్యూనిస్టు పార్టీ సింగరేణి కొల్ బెల్ట్ కమిటిని తప్పుదోవ పట్టించే విధంగా తన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా తాను ఏలాంటి అక్రమా వసూళ్లకు పాల్పడలేదని, తన కుటుంబ పరిస్థితుల స్థితిగతులపై అరా తీస్తే నిజం తెలుస్తుందని కోరారు. ఒకవేళ తాను తెలియక ఏదైన తప్పు చేసి ఉంటే క్షమించాలని కొరారు.