Homeహైదరాబాద్latest NewsHBD Chiranjeevi: మూడు తరాలను మెప్పించిన నటుడు.. చిరు గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు...

HBD Chiranjeevi: మూడు తరాలను మెప్పించిన నటుడు.. చిరు గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?

ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండుగ రోజు. కొణిదెల శివ శంకర వరప్రసాద రావుగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో అంజనాదేవి, వెంకటరావు దంపతులకు ఆగస్టు 22వ తేదీన జన్మించారు. 1955వ సంవత్సరంలో జన్మించిన ఆయన తన 69వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.

సుప్రీమ్‌గా చివరి సినిమా.. మెగాస్టార్‌గా మెదటి సినిమా ఇదే
ఒకే హీరోకి రెండు బిరుదులు ఉండటం అరుదు. తొలినాళ్లలో ‘సుప్రీమ్‌ హీరో’గా పేరొందిన చిరు ఆ తర్వాత ‘మెగాస్టార్‌’గా విశేష క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 1988లో వచ్చిన ‘మరణ మృదంగం’తో చిరంజీవి.. మెగాస్టార్‌గా మారారు. ఆ చిత్ర నిర్మాత కె.ఎస్‌. రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. చిరు ‘సుప్రీమ్‌ హీరో’గా కనిపించిన చివరి చిత్రం ‘ఖైదీ నంబరు 786’. సుప్రీమ్‌ హీరో, మెగాస్టార్‌.. ఈ రెండింటిపైనా పాటలు రావడం విశేషం.

మూడు తరాలను మెప్పించిన నటుడు
చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌ చిరంజీవి స్థాయి వేరు.. మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ‘స్వయంకృషి’తో నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాలతో పోటీ పడిన ఏకైన నటుడు ఆయనే. మూడు తరాల అభిమానులను సంపాదించిన నటుడు కూడా ఈయనే. మెగా ప్రస్థానంలో చిరంజీవి నటన, డాన్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయన చిత్రాల్లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.

’చిరు‘ సత్కారాలు
2006 జనవరిలో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి పద్మభూషణ్ పురస్కారం.. అదే ఏడాది నవంబర్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. 1998, అక్టోబర్ 2న ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ స్థాపించాడు. చిరంజీవి బ్లడ్ బాంక్, చిరంజీవి ఐ బాంక్ నాలుగేళ్లు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను అందుకొన్నాయి. అనంతరం చిరంజీవి మే 10న పద్మ విభూషణ్‌ అందుకున్నారు.

చిరు గురించి ఆసక్తికరమైన విషయాలు
‘బావగారు బాగున్నారా’ చిత్రంలో ఓ సన్నివేశం కోసం 240 అడుగుల ఎత్తునుంచి దూకారు. ఏక, ద్వి, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 100 రోజులు ప్రదర్శితమైన రికార్డు ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చిరంజీవికే దక్కింది. రూ.కోటికిపైగా పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లో వార్తల్లో నిలిచారు. ఘరానా మొగుడు.. రూ.10 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన తొలి తెలుగు చిత్రంగా, ‘ఇంద్ర’..రూ. 30 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు చేసిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించాయి.

Recent

- Advertisment -spot_img