యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. ఫస్ట్ రోజే రూ.172 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, రెండు రోజుల్లో రూ.243 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఆదివారం వీకెండ్తో కోట్ల రూ. 300 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మూడో రోజు రూ. 61 కోట్లు వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లో రూ.304 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.