Homeహైదరాబాద్latest Newsతెలంగాణ కాంగ్రెస్ లో అగ్గి రాజేసిన NSUI రాష్ట్ర అధ్యక్షుడి నియామకం.. ఎందుకంటే..?

తెలంగాణ కాంగ్రెస్ లో అగ్గి రాజేసిన NSUI రాష్ట్ర అధ్యక్షుడి నియామకం.. ఎందుకంటే..?

NSUI రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై సొంత పార్టీ కార్యకర్తలే తీవ్రంగా మండిపడుతున్నారు. వివరాలలోకి వెళ్తే.. తెలంగాణ NSUI అధ్యక్షుడిగా ఈ నెల 13న‌ యడవల్లి వెంకటస్వామిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. వెంకటస్వామి ఏపీకి చెందిన వ్యక్తి. బాపట్ల జిల్లా చిన కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్య‌క్తి అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. వెంకటస్వామి నియామకంపై తెలంగాణ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ రాశారు. వెంకటస్వామిని తొలగించి వెంటనే తెలంగాణకు చెందిన వ్యక్తికి NSUI అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img