ఇది నిజం, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో బుధవారం రైతులు ఆందోళనలకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మంగళవారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే స్థానిక నిర్వాహకులు వారం రోజుల నుండి లారీలు రాక, మీ ధాన్యం ఉంచితే ఉంచండి లేకపోతే తీసుకపోవుండేనంటూ చేతులెత్తేశారు. ఇదంతా చూస్తూ రైతులు ఇది అధికారుల నిర్లక్ష్యమా?.. నిర్వాహకులు నిర్లక్ష్యమా? అని అయోమయంలో పడిపోయారు.