ఏపీలోని అచ్యుతాపురం ఘటన బాధితులను వైజాగ్ ఆస్పత్రిలో మాజీ సీఎం జగన్ శుక్రవారం పరామర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధాకరమని, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. అదే విధంగా మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియా ఇంకా అందలేదని, వెంటనే అందించాలని కోరారు. ప్రభుత్వానికి రెడ్ బుక్ పై ఉన్న శ్రద్ద, ప్రజల భద్రతపై లేదని జగన్ విమర్శించారు.