Homeహైదరాబాద్latest Newsప్రతి రైతుకు రుణమాఫీ అందేలా అధికారులు చొరవ చూపాలి

ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా అధికారులు చొరవ చూపాలి

  • రైతులు వినతి పత్రం అందజేత

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: రైతు రుణమాఫీ అర్హులందరికీ అందకపోవడంచే, రైతు నాయకులు ఆర్డీఓ ఆఫీస్ మెట్ పల్లిలోని అధికారిని డి ఎ ఒ వసంతకీ శనివారం వినతిపత్రం సమర్పించారు. అర్హులందరికీ రుణమాఫీ అందేలా చొరవ చూపాలని కోరారు. ఈ సందర్బంగా మాజీ సింగల్ విండో చైర్మన్ అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ చాలామంది రైతులకు మాఫీ కాలేదని అన్నారు. కొన్ని బ్యాంకుల సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అదేవిధంగా రెండు లక్షల పైచిలుకు ఋణం ఉన్నా రైతులకు రుణమాఫీ కాక మరియు కుటుంబం మొత్తం రెండు లక్షల పైన ఉన్నవారికి కూడ రుణమాఫీ కాలేదని దీనితో రైతులు చాలా ఆందోళనకు గురిఆవుతున్నారని అన్నారు.

కావున దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అధికారుల ద్వారా కోరుతున్నామని తెలిపారు. లేనిచో రైతులు ఆందోళన కార్యక్రమాలు చెపడతారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమం ఆభాసుపాలు కాకుండా చూడాలని అధికారులను కోరారు. అనంతరం వ్యవసాయ అధికారిణి ఎ డి ఎ లావణ్య గారిని మరియు ఏ. ఒ. ఆలీ గారిని కలిసి పరిస్థితి వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు గోపిడి అక్కపెల్లి, జరుపుల దేవదాస్, కాతిపెల్లి మోహన్ రడ్డి, గోపిడి వెంకట్ రెడ్డి, సుంకర ప్రసాద్, ఆడెపు రమణ, రెండ్ల రమేష్, మామిడి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img