Homeహైదరాబాద్latest Newsటీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ నేపథ్యమిదే..! చేపట్టిన పదవులివే..!

టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ నేపథ్యమిదే..! చేపట్టిన పదవులివే..!

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్‌‌కుమార్ గౌడ్‌ను హైకమాండ్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్‌లోని భీంగల్ మండలం రహత్‌నగర్‌లో ఆయన జన్మించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా సేవలందించారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్‌పల్లి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు.

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టిన పదవులివే

  • 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.
  • 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
  • మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియామకం.
  • 2021 జూన్- 26న టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.
  • 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామకం అయ్యారు.
  • 2023 జూన్ 20న టీపీసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.
  • ఈ ఏడాది జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందారు. రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.
spot_img

Recent

- Advertisment -spot_img