Homeహైదరాబాద్latest Newsబలంగా తాకిన బంతి.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన బౌలర్! (వీడియో)

బలంగా తాకిన బంతి.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన బౌలర్! (వీడియో)

అమెరికాలో జరుగుతున్న MLC టోర్నీలో చోటుచేసుకున్న ఓ ఘటన క్రికెట్ అభిమానులను కలవరపెట్టింది. సియాటిల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్ పేస్ బౌలర్ కార్మీ రౌక్స్ బంతి బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రౌక్స్ ముఖం నుంచి రక్తం కారింది. కాసేపటికే రౌక్స్‌ స్పృహలోకి వచ్చి స్వయంగా డగౌట్‌కు నడిచి వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే యునికార్న్స్ బౌలర్ రౌక్స్ 3వ ఓవర్ వేస్తుండగా, ప్రత్యర్థి జట్టు బ్యాటర్ రైన్ రికెల్టన్ షాట్ కొట్టాడు. అయితే బంతి నేరుగా వచ్చి రౌక్స్ ముఖానికి తగిలింది. నొప్పితో మెలికలు తిరుగుతూ అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య సిబ్బంది వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. కాసేపటి తర్వాత కోలుకున్న రౌక్స్ మైదానం వీడాడు.

Recent

- Advertisment -spot_img