కర్ణాటకలో నీటి సంక్షోభం నెలకొంది. ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో బీర్ల అమ్మకాలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఏప్రిల్‌లో గత 15 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 23.5 లక్షల కార్టన్ బాక్సుల బీర్లు అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. గత సంవత్సరం డేటాతో పోల్చితే ఈ ఏడాది ప్రారంభం నుంచే బీర్ అమ్మకాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటి వరకు వేసవిలో అమ్మకాలలో 30% పెరుగుదల నమోదైంది.